The ten days of Dussehra festival will begin on September 29, and the celebrations will continue till October 8 (Dussehra day) at Vijayawada Durga temple. In this context, The temple EO Suresh Babu conducted a meeting with the officials over the arrangements.
#Vijayawada
#dussehra2019
#DurgaTemple
#DussehraFestival
#Andraprdesh
#apcmjagan
#ysrcp
ఈనెల 29 నుంచి వచ్చే నెల 8 వరకు జరిగే ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. దుర్గమాత పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. రేపు నిర్వహించే స్వప్నాభిషేకం అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు ప్రతీ రోజు ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే మొత్తం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు 7 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దసరా ఉత్సవాలలో భక్తులకు అమ్మవారి దర్శనార్థం ఆర్జిత సేవలను నిలుపు చేసింది. అదేవిధంగా కుంకుమార్చనకు ప్రత్యేక సమయం, స్థలం కేటాయించారు.